అనుష్క కంటే ముందు తమన్నాతో విరాట్ డేటింగ్?
- తమన్నాతో కలిసి ఓ ప్రకటనలో నటించిన క్రికెటర్
- 2013లో విడిపోయిన విరాట్, తమన్నా
- ఆ తర్వాత మరో నటితో కూడా విరాట్ డేటింగ్
అయితే 2013లో బ్రెజిలియన్ సుందరి ఇసబెల్ లేతే రంగప్రవేశంతో వీరిద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయట. ఓ వ్యాపారవేత్త నిర్వహించిన వేడుకలో విరాట్, ఇసబెల్ను కలిశాడు. ఆమె ఒక బాలీవుడ్ సినిమాలో కూడా నటించింది. తర్వాత వీరిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం నడిచినట్లు, ఇద్దరూ కలిసి సింగపూర్ పర్యటనకు కూడా వెళ్లినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ వీరి బంధం కూడా ఎక్కువ కాలం నిలవలేదు. ఆ తర్వాత విరాట్, అనుష్క రూపంలో తన లేడీ లవ్‌ను కలిశాడు. ఇప్పుడు పెళ్లి కూడా చేసుకున్నాడు.