పాకిస్థాన్ కుదేలు.. దారుణంగా పడిపోయిన రూపాయి మారకం విలువ
- పాక్లో దిగజారుతున్న ఆర్థిక పరిస్థితి
- రోజురోజుకు పడిపోతున్న రూపాయి మారకం విలువ
- ఫలించని సెంట్రల్ బ్యాంకు ప్రయత్నాలు
- 12.9 బిలియన్ డాలర్లకు చేరుకున్న విదేశీ ద్రవ్య నిల్వలు
రూపాయి మారకం విలువ పడిపోవడంపై పాక్ ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి వకార్ మసూద్ మాట్లాడుతూ ‘ఇది అసాధారణం’ అని పేర్కొన్నారు. ఆర్థిక సమస్యలపై మరింతగా దృష్టి సారించాల్సిన అవసరం ఉందని అన్నారు. పడిపోతున్న విదేశీ మారక ద్రవ్య నిల్వలను కాపాడుకునేందుకు ప్రభుత్వం గతనెలలో 2.5 బిలియన్ డాలర్లు అప్పు చేసింది. కాగా, అక్టోబరు నాటికి పాక్ వద్ద ఉన్న విదేశీ ద్రవ్య నిల్వలు 29 శాతం క్షీణించి 12.9 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.