"ఆంధ్రా అధికారివి... నాకే ఎదురొస్తావా?" అంటూ టీఆర్ఎస్ ఎమ్మెల్యే తిట్లపురాణం... వైరల్ అవుతున్న ఆడియో!
- ఓ అధికారిణికి పోస్టింగ్ ఇవ్వాలని సీఈఓకు బెదిరింపులు
- పని చేయకుంటే అంతు చూస్తానన్న వీరేశం
- తన పరిధిలోకి రాదని వారించిన సీఈఓ
- అయినా వినని టీఆర్ఎస్ ఎమ్మెల్యే
బ్యాంకు డీజీఎం లక్షమ్మ నిధుల దుర్వినియోగం కేసులో సస్పెండ్ కావడంతో, ఆమెకు తిరిగి పోస్టింగ్ ఇవ్వాలని సీఈఓ మదన్ మోహన్ కు వీరేశం ఫోన్ చేశాడు. ఈ విషయం తన పరిధిలోది కాదని ఆయన చెబుతుంటే, "నా మాటకే ఎదురు చెప్తావా... ఆంధ్రా అధికారివి" అంటూ నోరు జారడంతో పాటు రాయడానికి వీల్లేని బూతులు తిట్టాడు. అడిగిన పని చేయకుంటే అంతు చూస్తానని హెచ్చరించాడు. ఈ వీడియో వైరల్ అవుతుండగా, వీరేశం వైఖరిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.