పవన్ కల్యాణ్: పవన్ కల్యాణ్ అడిగినందుకైనా శ్వేతపత్రం విడుదల చేయాలి: ఉండవల్లి

  • శ్వేతపత్రాలు విడుదల చేయడంలో చంద్రబాబు అనుభవజ్ఞుడు
  • ‘పోలవరం’పై శ్వేతపత్రం విడుదల చేయాలి
  •  మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్

జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కోరినందుకైనా ‘పోలవరం’పై శ్వేతపత్రాన్నిసీఎం చంద్రబాబు విడుదల చేయాలని పార్లమెంటు మాజీ సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ డిమాండ్ చేశారు. ‘పోలవరం’పై శ్వేతపత్రం విడుదల చేయాలని పవన్ కోరితే, ఇందుకు సంబంధించిన అన్ని వివరాలు ఆన్ లైన్ లో ఉన్నాయని, దానిని విడుదల చేయడం అనవసరమని చంద్రబాబు అనడం విడ్డూరమని అన్నారు.

శ్వేతపత్రాలు విడుదల చేయడంలో చంద్రబాబు అనుభవజ్ఞుడని, ‘పోలవరం’పై కూడా ఓ శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కాగా, పోలవరం ప్రాజెక్టును పవన్ కల్యాణ్ నిన్న సందర్శించారు. ఈ సందర్భంగా శ్వేతపత్రం విడుదల చేయాలని ప్రభుత్వాన్ని ఆయన కోరడం జరిగింది.  

  • Loading...

More Telugu News