కేంద్ర మాజీ మంత్రి తనపై చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన ప్రధాని మోదీ!
- ప్రధాని మోదీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన మణిశంకర్ అయ్యర్
- ఆయన అన్న మాటలు అవమానించడం మాత్రమే కాదు
- ఇది ఆయన మొగలాయి మైండ్‌సెట్ ను తెలియజేస్తోంది
- బ్యాలెట్ బాక్స్‌లలో ప్రజలు వారికి తగిన సమాధానం చెబుతారు-మోదీ
తనను కిందిస్థాయి వ్యక్తి అని, సంస్కారం లేని వాణ్ణని అన్నారని ప్రధాని మోదీ గుర్తు చేశారు. ఆయన అన్న మాటలు అవమానించడం మాత్రమే కాదని, ఇది ఆయన మొగలాయి మైండ్‌సెట్ ను తెలియజేస్తోందని అన్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలపై తాను ఇంతకంటే ఏమీ చెప్పలేనని అన్నారు. అది కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానమని ఆ ట్వీట్లో పేర్కొన్నారు. బ్యాలెట్ బాక్స్‌లలో ప్రజలు వారికి తగిన సమాధానం చెబుతారని, ఇటువంటి వారు మూల్యం చెల్లించుకుంటారని అన్నారు.