ఎన్టీఆర్-రామ్‌చరణ్ మల్టీస్టారర్ మూవీలో గ్రాఫిక్స్ వుండవట!
- మల్టీస్టారర్ సినిమా కోసం కథ రెడీ చేస్తోన్న విజయేంద్ర ప్రసాద్
- రాజమౌళి దర్శకత్వంలో మల్టీస్టారర్ మూవీలో చరణ్, ఎన్టీఆర్
- తన సినిమాల్లో గ్రాఫిక్స్‌ను బాగా వాడుకునే రాజమౌళి
- ఈ సినిమాలో మాత్రం గ్రాఫిక్స్ ఉండబోవు?
తాను తదుపరి చిత్రాన్ని వీఎఫ్ఎక్స్తో పని లేకుండా తీస్తానని రాజమౌళి కొన్ని నెలల ముందు తెలిపారు. ఆయన చెప్పిన ఆ మాటలు ఈ వార్తకు బలాన్నిస్తున్నాయి. గ్రాఫిక్స్‌ను ఉపయోగించకుండా రాజమౌళి ఎటువంటి కథతో ఈ సినిమాను తెరకెక్కిస్తారన్న ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం రామ్‌చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ల చేతుల్లో తలో సినిమా ఉంది. సదరు హీరోలు ఆ సినిమాల షూటింగులను ముగించుకోగానే రాజమౌళి సినిమాలో నటించనున్నారు.