jimmikki Kammal: నడిరోడ్డుపై ముగ్గురమ్మాయిల చిందులు... వైరల్ అవుతున్న వీడియో!

  • 'జిమ్మిక్కి కమ్మల్' పాటకు రోడ్డుపై డ్యాన్స్
  • ముస్లిం యువతులుగా కనిపిస్తున్న అమ్మాయిలు
  • ఇస్లాం నిబంధనలకు వ్యతిరేకమంటున్న సంప్రదాయవాదులు
  • నృత్యంపై లక్షలాది మంది ప్రశంసలు
కేరళలో ఇటీవలి బంపర్ హిట్ సాంగ్ 'జిమ్మిక్కి కమ్మల్'కు నడిరోడ్డుపై నృత్యం చేస్తున్న ముగ్గురమ్మాయిల వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మల్లాపూర్ లోని ఓ జంక్షన్ లో ముఖానికి ముసుగులు ధరించిన ముగ్గురు అమ్మాయిలు డ్యాన్స్ చేస్తూ, ఆపై వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ ముగ్గురూ ముస్లిం అమ్మాయిలుగా కనిపిస్తుండటంతో, ఇస్లాం నిబంధనలకు ఇంత విరుద్ధంగా ప్రవర్తిస్తారా? అని సంప్రదాయ ముస్లింలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తుండగా, లక్షలాది మంది వారి డ్యాన్స్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అమ్మాయిల వీడియోను మీరూ చూడవచ్చు.
jimmikki Kammal
Kerala
Dance on Road
Viral

More Telugu News