సొంత కొడుకు కోసం 'బాహుబలి'ని సలహా అడిగిన 'కట్టప్ప'!
- 'క్షణం' సినిమాపై మక్కువ పెంచుకున్న సత్యరాజ్ కుమారుడు శిబి
- సినిమాను తమిళంలో రీమేక్ చేస్తే ఎలా ఉంటుందని ప్రభాస్ ను అడిగిన సత్యరాజ్
- స్క్రిప్ట్ డిఫరెంట్ గా ఉందని ప్రోత్సహించిన ప్రభాస్
- మీడియా సమావేశంలో గుర్తు చేసుకున్న సత్యరాజ్
ఈ చిత్రం 8న రిలీజ్ కానున్న నేపథ్యంలో, ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్న సత్యరాజ్, తాను ప్రభాస్ సలహా తీసుకున్న విషయాన్ని గుర్తు చేసుకున్నాడు. శిబి తన వద్దకు వచ్చి 'క్షణం' చిత్రాన్ని రీమేక్ చేయాలని అనుకుంటున్నట్టు చెప్పాడని, ఆ సమయంలో తాను 'బాహుబలి' షూటింగ్ లో ఉన్నానని, 'క్షణం' గురించి ప్రభాస్ ను అడుగగా, సినిమాలో విభిన్నత ఉందని, స్క్రిప్ట్ డిఫరెంట్ గా ఉందని, చేయవచ్చని చెప్పాడని, ప్రభాస్ మాటలు తనలో కాన్ఫిడెన్స్ పెంచడంతోనే, సినిమా కూడా చూడకుండా, రైట్స్ కొని రీమేక్ చేశామని చెప్పుకొచ్చాడు. అదీ అసలు సంగతి.