Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నేను బాగా లావైపోయాననే ప్రచారం కూడా జరిగింది: జమున

  • నాకు అప్పుడు సిజేరియన్ జరిగింది 
  • ఆ సమయంలోనే 'మనసు - మాంగల్యం' ప్లాన్ చేశారు 
  • నేను లావై పోయాననే టాక్ ఆ నిర్మాతను కంగారు పెట్టింది 
  • మా ఇంటికి వచ్చి నన్ను చూసి ఆశ్చర్యపోయాడు  
అందమైన కథానాయికగా జమున చాలాకాలం పాటు తన కెరియర్ ను కొనసాగించారు. అంతకాలం పాటు తాను అలా కొనసాగడానికి కారణం ఆరోగ్యం విషయంలో తాను తీసుకున్న శ్రద్ధేనంటూ .. ఆనాటి సంగతులను ప్రస్తావించారు. " మా అమ్మానాన్నలు చాలా స్లిమ్ గా వుండేవాళ్లు. దాంతో సహజంగానే నేను స్లిమ్ గా ఉండేదానిని. పెళ్లై పిల్లలు కలిగాక మాత్రం, ఆరోగ్య పరంగా నేను చాలా జాగ్రత్తలు తీసుకున్నాను" అన్నారు.

 "సిజేరియన్ తరువాత లావు కావడం జరుగుతుందట. అందువలన అప్పటి నుంచి ఆహార నియమాలు పాటిస్తూ వచ్చాను. ఇదే సమయంలో నిర్మాత కోగంటి కుటుంబరావు 'మనసు - మాంగల్యం' ప్లాన్ చేశారు. హీరోగా అక్కినేని నాగేశ్వరరావును తీసుకున్నారు. హీరోయిన్ గా నన్ను అనుకుంటే .. జమున ఇప్పుడు సావిత్రి గారికంటే లావుగా అయిందని ఆయనతో ఎవరో అన్నారట. దాంతో ఆయన కంగారుపడిపోయి .. ఏకంగా ఇంటికి వచ్చేశారు. అంతకుముందు కన్నా సన్నగా వున్న నన్ను చూసి ఆయన ఆశ్చర్యపోయారు" అంటూ చెప్పుకొచ్చారు.   
jamuna
akkineni

More Telugu News