metro station: అమీర్ పేట మెట్రో 'బాంబు బెదిరింపు' వెనుక అసలు వాస్తవం!

  • ఈ ఉదయం బాంబు ఉందని ఆగంతకుని ఫోన్
  • ఉరుకులు, పరుగులు పెట్టిన పోలీసులు
  • హెల్మెట్ ఉన్న బ్యాగ్ ను చూసి బాంబుగా భ్రమ
  • బాంబు లేదని తేల్చిన పోలీసులు
ఈ ఉదయం అమీర్ పేట మెట్రో స్టేషన్ లో బాంబు ఉందంటూ ఓ ఆగంతకుడి నుంచి వచ్చిన ఫోన్ పోలీసులను ఉరుకులు, పరుగులు పెట్టించిన సంగతి తెలిసిందే. బాంబ్ స్క్వాడ్ తనిఖీలు చేపట్టిన పోలీసులు ఎటువంటి బాంబూ లేదని తేల్చారు. ఫోన్ చేసిన వ్యక్తి తానంతట తానుగానే పోలీసుల ఎదుటకు వచ్చినట్టు తెలుస్తోంది.

దీని వెనుక అసలు వాస్తవం ఏంటంటే, మెట్రో రైలు ఎక్కేందుకు వచ్చిన ఓ వ్యక్తి, తన హెల్మెట్ ను బ్యాగులో ఉంచి, రైల్వే స్టేషన్ లో ఓ మూలన పెట్టి వెళ్లిపోయాడు. అటుగా వచ్చిన వ్యక్తికి ఆ బ్యాగ్ పై అనుమానం వచ్చింది. పట్టుకుని చూడబోగా, గట్టిగా తగలడంతో, బాంబు ఉందన్న అనుమానంతో పోలీసులకు ఫోన్ చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించారు. ఓ బాధ్యతగల పౌరుడిగా, ఫోన్ చేసిన వ్యక్తిని పరిగణిస్తున్నామని పోలీసు వర్గాలు తెలిపాయి.
metro station
Ameerpet
Hyderabad
Bomb Call

More Telugu News