Rahul Gandhi: మహిళల గురించి... నరేంద్ర మోదీకి 5వ ప్రశ్న సంధించిన రాహుల్ గాంధీ!

  • రోజుకో ప్రశ్న వేస్తున్న కాంగ్రెస్ నేత
  • గుజరాత్ లో మహిళలకు భద్రత ఎక్కడ?
  • పడకేసిన మహిళల విద్య, ఆరోగ్యం 
  • వాడివేడిగా సాగుతున్న ఎన్నికల ప్రచారం
ప్రధాని నరేంద్ర మోదీకి రోజుకో ప్రశ్నను సంధిస్తున్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, తన ఐదవ ప్రశ్నను సంధించారు. ఈసారి ఆయన ప్రశ్న గుజరాత్ మహిళలు కేంద్ర బిందువుగా సాగింది. రాష్ట్రంలో మహిళలకు భద్రత, వారి విద్య, ఆరోగ్యంపై మోదీని రాహుల్ ప్రశ్నించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ప్రశ్నను పోస్టు చేస్తూ, రాష్ట్రంలో ఇరవై సంవత్సరాలకు పైగా అధికారంలో ఉన్న బీజేపీ, వారికి పౌషకాహారాన్ని, సరైన విద్యను అందించడంలో విఫలమైందని ఆరోపించారు.

ఆశా హెల్త్ వర్కర్లు, అంగన్ వాడీ వర్కర్లు చాలా అసంతృప్తితో ఉన్నారని విమర్శించారు. వారికి ఏం సమాధానం ఇస్తారని ప్రశ్నించారు. కాగా, మరో వారంలో గుజరాత్ అసెంబ్లీకి తొలి విడత ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నెల 9న తొలివిడత, ఆపై 14న రెండో విడత ఎన్నికలు జరగనున్నాయి. గుజరాత్ లో 22 సంవత్సరాల బీజేపీ పాలనపై తాను నిత్యమూ ఓ ప్రశ్నను సంధిస్తానని రాహుల్ పేర్కొన్న సంగతి తెలిసిందే.
Rahul Gandhi
Gujarath
Narendra Modi

More Telugu News