పట్టపగలు న్యూఢిల్లీ, కన్నాట్ ప్లేస్... యువతిని వేధిస్తూ, చెత్తపని చేసిన వ్యక్తి!
- భోజన విరామ సమయంలో టెర్రెస్ పైకి వెళ్లిన టీచర్
- అటకాయించి వేధించిన వ్యక్తి
- సీసీటీవీలో స్పష్టంగా కనిపించని ముఖం
అదే సమయంలో పైకి ఓ అపరిచితుడు వచ్చాడు. ఆమెపై దాడికి ప్రయత్నించాడు. కిందకు వెళ్లకుండా తలుపులకు గడియపెట్టి నిలువరించాడు. బాధితురాలు భయాందోళనలతో ఉండగా, ఆమెనే తదేకంగా చూస్తూ, పాడుపని మొదలు పెట్టాడు. ఆమె కేకలు పెడుతూ ఉంటే, చేతిలో ఉన్న ఫోన్ లాక్కుని పక్క భవంతి టెర్రెస్ పైకి దూకి పారిపోయాడు. సహోద్యోగులు సీసీటీవీ ఫుటేజ్ ని చూపించగా, నిందితుడిని గుర్తించినప్పటికీ, అతని ముఖం సరిగ్గా కనిపించలేదు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, అతన్ని గుర్తించే పనిలో ఉన్నారు.