కిదాంబి శ్రీకాంత్‌కి డిప్యూటీ కలెక్టర్ హోదా.. ఆమోదించిన ఏపీ శాసనసభ
- గతంలో పీవీ సింధుకు కూడా
- ఈ ఏడాది నాలుగు సూపర్ సిరీస్ టైటిల్స్ సాధించిన శ్రీకాంత్
- ప్రతిభను గుర్తించిన ఏపీ ప్రభుత్వం
జూన్‌లో ఇండోనేషియా ఓపెన్‌తో ప్రారంభించి, ఆస్ట్రేలియన్ ఓపెన్, డెన్మార్క్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ సిరీస్‌లు సాధించి శ్రీకాంత్ ఈ ఘనత సాధించిన మొదటి భారతీయుడిగా రికార్డుకెక్కాడు. అంతేకాకుండా బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ సూపర్ సిరీస్ ఫైనల్స్‌కు కూడా శ్రీకాంత్ చేరుకున్నాడు.