హెచ్-1బీ వీసా జారీలో ప్రస్తుతానికి ఎలాంటి మార్పులు లేవు: అమెరికా
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

హెచ్-1బీ వీసా జారీలో ప్రస్తుతానికి ఎలాంటి మార్పులు లేవు: అమెరికా

  • పాత తరహాలోనే వీసాల జారీ
  • వీసా ప్రక్రియను మార్చాలంటే చట్టంలో మార్పులు చేయాలి
  • ప్రస్తుతానికైతే ఎలాంటి మార్పులు లేవు
అమెరికాలో స్థానికులకు ఉద్యోగావకాశాలు పెంచే క్రమంలో హెచ్-1బీ వీసాలపై ఉక్కుపాదం మోపుతామంటూ ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, ప్రస్తుతానికి అలాంటి చర్యలు చేపట్టడం లేదని దక్షిణాసియాకు అమెరికా డిప్యూటీ అసిస్టెంట్ స్టేట్ సెక్రటరీ థామస్ వాజ్దా అన్నారు. ఎలాంటి చట్టం తీసుకురాలేదని స్పష్టం చేశారు.

గతంలో ఉన్నట్టుగానే వీసాలు జారీ అవుతున్నాయని చెప్పారు. కోల్ కతాలో జరిగిన బెంగాల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. వీసా జారీ విధానాన్ని మార్చాలంటే చట్టంలో అనేక మార్పులు తీసుకురావాల్సి ఉంటుందని ఆయన చెప్పారు. 
h1b visa
america

More Telugu News