పోలవరంపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడవద్దు: పార్టీ నేతలకు చంద్రబాబు సూచన
- కేంద్రంపై విమర్శలు చేయవద్దు
- పోలవరంను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకుందాం
- రాజకీయం చేయడం మన ఉద్దేశం కాదు
కేంద్రం నుంచి వచ్చిన లేఖకు తప్పనిసరిగా జవాబు ఇస్తామని చెప్పారు. పోలవరంను రాజకీయం చేయడం తమ ఉద్దేశం కాదని... రాష్ట్ర ప్రయోజనాలే తమకు ముఖ్యమని తెలిపారు. పోలవరం విషయాన్ని రాజకీయ కోణంలో చూడవద్దని తమ శ్రేణులకు సూచించారు. పోలవరం విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని చెప్పారు. ఈ అంశాన్ని సామరస్య పూర్వకంగా పరిష్కరించుకుందామని అన్నారు.