అణు క్షిపణుల తయారీలో ఉత్తర కొరియా గొప్ప ముందడుగు!: నిపుణుల అంచనా
- ఉత్తరకొరియా హ్వాసంగ్-15 క్షిపణిపై విశ్లేషకుల ఆందోళన
- అగ్రరాజ్యం అమెరికాలోని ఏ ప్రాంతాన్నైనా తాకగలదు
- సుదూర లక్ష్యాలను తాకగల క్షిపణులను ఉ.కొరియా తయారు చేసే అవకాశం
ఈ ప్రయోగం ద్వారా ఉత్తర కొరియా అణు క్షిపణుల తయారీలో గొప్ప ముందడుగు వేసిందని అంటున్నారు. ఇకపై సుదూర లక్ష్యాలను తాకగల ఖండాంతర క్షిపణులు తయారు చేయాలన్న ఉత్తర కొరియా ఆశయం త్వరలోనే నెరవేరొచ్చని అభిప్రాయపడుతున్నారు. తాజాగా ఆ దేశం పరీక్షించిన క్షిపణి సుమారు వెయ్యి కిలోల పేలోడ్‌ను మోసుకెళ్లగలదు.