west godavari: లవర్ ని కామెంట్ చేసిన వ్యక్తిని హతమార్చిన ఇద్దరు మైనర్లు

  • రాజులలంకలో రెండు నెలల క్రితం గంగరాజు హత్య
  • సుదీర్ఘ దర్యాప్తు చేసిన పోలీసులు
  • ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు
లవర్ ని కామెంట్ చేశాడని ఒక వ్యక్తిని ఇద్దరు మైనర్లు హతమార్చిన ఘటన పశ్చిమగోదావరి జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసింది. ఘటన వివరాల్లోకి వెళ్తే... పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం మండలం రాజులలంకలో రెండు నెలల క్రింతం గంగరాజు అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు సుదీర్ఘ దర్యాప్తు జరిపి, ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకున్నారు.

వారిని విచారించగా ఆ హత్యకేసులో వాస్తవాలు వెలుగు చూశాయి. ఈ ఇద్దరు మైనర్లలో ఒక వ్యక్తి లవర్ ను గంగరాజు కామెంట్ చేశాడని, దీంతోనే అతనిని వారిద్దరూ పథకం ప్రకారం హతమార్చారని తేలింది. దీంతో వారిద్దరినీ రిమాండ్ కు జువైనల్ హోంకు పంపారు. దీనిపై మరింత లోతైన విచారణ జరుగుతోందని పోలీసులు తెలిపారు. 
west godavari
rajulalanka
murder
minor's

More Telugu News