సెల్ఫీ కోసం ప్రమాదకర విన్యాసం... మరణించిన యువకుడు
- గ్రనేడ్ పిన్ తీసి చేతిలో పట్టుకుని ఫొటోలు
- చేతిలోనే పేలిన గ్రనేడ్
- రష్యాలో దారుణం
అలెగ్జాండర్ సాష ఛెచిక్... చేతిలో గ్రనేడ్ పట్టుకుని ఫొటోలు దిగాడు. వాటిని స్నేహితులతో కూడా పంచుకున్నాడు. తర్వాత గ్రనేడ్ పిన్ తీసి ఫొటోలు దిగాలని ప్రయత్నించాడు. స్నేహితులు వారిస్తున్నా వినిపించుకోకుండా గ్రనేడ్ పిన్ తీశాడు. పిన్ తీశాక కూడా అలాగే చేత్తో పట్టుకుని సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించాడు. కానీ గ్రనేడ్ పేలడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మొదట పోలీసులు ఇది ఆత్మహత్య అనుకున్నారు. తర్వాత ఛెచిక్ స్నేహితులు చెప్పినది విని పొరపాటున జరిగిన ప్రమాదమని స్పష్టం చేశారు.