బాలీవుడ్ సినిమాలపై సుబ్రహ్మణ్యస్వామి సంచలన వ్యాఖ్యలు
- బాలీవుడ్ కు దుబాయ్ నుంచి ఆర్థిక సహకారం అందుతోంది
- బాలీవుడ్ పై సుప్రీంకోర్టు పరిశీలన జరపాలి
- భారతీయుల సినిమాలను భారతీయుల కోసమే తీయాలి
బాలీవుడ్ సినీ ఇండస్ట్రీపై సుప్రీంకోర్టు పరిశీలన చేయాలని స్వామి కోరారు. బాలీవుడ్ చిత్రాలను కేవలం భారతీయుల కోసమే నిర్మించాలని డిమాండ్ చేశారు. మరోవైపు, సుబ్రహ్మణ్యస్వామి వ్యాఖ్యలపై సీబీఎఫ్సీ సభ్యుడు అర్జున్ గుప్తా స్పందించారు. స్వామి వ్యాఖ్యలపై ఆయన ప్రధాని మోదీకి లేఖ రాశారు. 'పద్మావతి' చిత్రానికి సంబంధించిన ఆర్థిక సహకారంపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ తో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.