Donald Trump: భలే ఇవాంకా... పుత్రికోత్సాహంలో డొనాల్డ్ ట్రంప్!

  • 'గ్రేట్ వర్క్ ఇవాంకా' అంటూ పొగడ్తలు
  • కుమార్తె ప్రసంగానికి ముగ్ధుడైన అమెరికా అధ్యక్షుడు
  • జీఈఎస్ ఉపన్యాసాన్ని షేర్ చేసిన డిపార్ట్ మెంట్ ఆఫ్ స్టేట్
హైదరాబాద్ లో జరుగుతున్న గ్లోబల్ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ సమ్మిట్ లో పాల్గొన్న తన కుమార్తె చేసిన ప్రసంగంపై అమెరికా అధ్యక్షుడు పొగడ్తలు కురిపించారు. "గ్రేట్ వర్క్ ఇవాంకా" అంటూ తన ట్విట్టర్ ఖాతాలో ఓ కామెంట్ పెట్టారు. తన కుమార్తె ప్రసంగానికి ముగ్ధుడైన ఆయన ప్రశంసించారు. అమెరికన్లు తమ కలలను సాకారం చేసుకునే దిశగా, తమ ప్రభుత్వం ఔత్సాహిక పారిశ్రామిక విధానాన్ని ఎంతో ప్రోత్సహిస్తోందని జీఈఎస్ ప్రారంభ ఉపన్యాసంలో ఇవాంక వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఆమె వ్యాఖ్యలను 20 సెకన్ల వీడియో రూపంలో యూఎస్ డిపార్ట్ మెంట్ ఆఫ్ స్టేట్ పోస్టు చేయగా, ట్రంప్ స్పందించారు.
Donald Trump
Ivanka trump
GES

More Telugu News