Upasana Kamineni: ఇవాంకతో సెల్ఫీ దిగి ట్విట్టర్ లో పోస్టు చేసిన చిరంజీవి కోడలు!

  • ఫలక్ నుమా ప్యాలెస్ విందులో సెల్ఫీ
  • మహిళలకు ప్రోత్సాహాన్ని కల్పిస్తున్నారు
  • మోదీకి, కేటీఆర్ కు ఉపాసన థ్యాంక్స్
ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్న ఇవాంకా ట్రంప్ తో అపోలో ఫౌండేషన్ వైస్ చైర్మన్ ఉపాసనా కామినేని సెల్ఫీ దిగారు. నిన్న ఫలక్ నుమా ప్యాలెస్ లో జరిగిన విందులో ఇవాంకతో పాటు పాల్గొన్న ఉపాసన ఆమెతో ఫొటో దిగి తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. ఈ అనుభూతి తనకెంతో సంతోషాన్ని కలిగించిందని, మహిళలకు ప్రోత్సాహాన్ని అందిస్తున్న నరేంద్ర మోదీ, ఇవాంక, కేటీఆర్, తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. నిన్న ఇవాంకాకు వెనుక వరుసలో ఉపాసన కూర్చుని ఉండగా, టీవీలో చూసిన ఆమె భర్త, హీరో రామ్ చరణ్, దాన్ని స్క్రీన్ షాట్ తీసి ఆమెకు పంపిన సంగతి తెలిసిందే.
Upasana Kamineni
Ivanka trump
Falaknuma palace

More Telugu News