Donald Trump: వచ్చే ఏడాది డొనాల్డ్ ట్రంప్ ఇండియా పర్యటన.. హింట్ ఇచ్చిన ఇవాంకా!

  • ట్రంప్ ఇండియాలో పర్యటిస్తారన్న ఇవాంకా
  • ఇవాంకా చెబితే ట్రంప్ చెప్పినట్టేనంటున్న విశ్లేషకులు
  • ఎక్కడికన్నది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్
"అతి త్వరలో అమెరికా అధ్యక్షుడు ఇండియాలో పర్యటిస్తారు" నిన్న గ్లోబల్ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ సమ్మిట్ లో మాట్లాడుతూ ఇవాంకా ట్రంప్ అన్న మాటలివి. దీంతో త్వరలోనే ట్రంప్ ఇండియా పర్యటన ఉంటుందని పలువురు అంచనా వేస్తున్నారు. ఇక ఇండియాను, ఇక్కడి పరిస్థితులను స్టడీ చేయడానికే ఇవాంకా వచ్చారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 2018లో ట్రంప్ ఇండియా టూర్ ఖాయమని అంటున్నారు.

 ఇవాంక చెబితే, ట్రంప్ చెప్పినట్టేనని, ఆయన తన మనసులోని ఉద్దేశాన్నే ఇవాంక ద్వారా చెప్పించారని విశ్లేషిస్తున్నారు. డొనాల్డ్ ట్రంప్ కన్నా, ప్రతిష్ఠాత్మక వార్టన్ స్కూల్ లో గ్రాడ్యుయేషన్ చదువుకున్న ఇవాంకాను డీల్ చేయడం సులువని చెబుతున్నారు. ఇక డొనాల్డ్ ట్రంప్ పర్యటన ఎప్పుడు, ఎక్కడికి, ఏ సందర్భంలో ఉంటుందన్నది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్సే.
Donald Trump
Ivanka trump
GES
Hyderabad
India

More Telugu News