giddi eshwari: 'చంద్రబాబంటే ఇష్టం లేదు... ఎస్టీ చైర్మన్ పదవి వస్తోంది'... గిడ్డి ఈశ్వరి కార్యకర్తలతో మాట్లాడుతున్న వీడియో దొరికిందన్న 'సాక్షి'!

  • టీడీపీలోకి వెళ్లాలనేమీ లేదంటున్న ఈశ్వరి
  • క్యాబినెట్ హోదా ఇస్తామన్నారు కాబట్టే...
  • పనులన్నీ చక్కబెట్టుకుందామని సముదాయింపు
  • వీడియోను బయటపెట్టని 'సాక్షి'
"చంద్రబాబు  అంటే నాకేమీ ఇష్టమని వెళ్లడం లేదు.  వెళ్లాలని కూడా లేదు. డిఫర్‌ అవడం వల్లనే వెళ్లాల్సి వస్తోంది. నేను ఏం చెబుతున్నానంటే, మంత్రివర్గ విస్తరణ రేపు జరిగితే రేపు, ఎల్లుండి జరిగితే ఎల్లుండి మంత్రి పదవిని ఇస్తామన్నారు.. వెంటనే మంత్రి పదవి ఇవ్వలేరు కాబట్టి ఎస్టీ కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవిని క్యాబినెట్‌ హోదాతో ఇస్తామన్నారు. రాష్ట్రంలోని మంత్రికి ఉన్నటువంటి పవర్స్‌ అన్నీ ఇస్తామన్నారు కాబట్టే వెళ్తున్నా" అని పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి తన కార్యకర్తలను సముదాయిస్తున్న వీడియో తమకు లభించిందని 'సాక్షి' దినపత్రిక వెల్లడించింది.

ఇప్పుడు వైఎస్ఆర్ సీపీ నుంచి బయటకు వెళ్లవద్దని కార్యకర్తలు అంటుంటే, వారికి ఈశ్వరి నచ్చజెప్పారని, ఎమ్మెల్యేగా ఏడాది సమయం ఉంటుంది కాబట్టి, పనులు చక్కబెట్టుకుందామని ఆమె అంటున్నట్టు ఈ వీడియోలో ఉందట. తాను మాట్లాడుతున్న వీడియోను తీస్తున్నారని గమనించిన ఆమె, "అంతా మనవాళ్లే ఉన్నారా? ఎవరైనా వీడియో తీస్తున్నారేమో చూడండి" అంటూ కంగారు పడ్డారట. అక్కడే ఉన్న ఓ యువకుడు ఈ వీడియోను తీసి 'సాక్షి'కి అందించారని ఆ పత్రిక  వెల్లడించింది.

giddi eshwari
Telugudesam
ysrcp

More Telugu News