ఇవాంకా రాకను వ్యతిరేకిస్తూ ఆందోళన.. ఉద్రిక్తత!
- టీపీఎఫ్ ఆధ్వర్యంలో సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద ప్రదర్శన
- అడ్డుకున్న పోలీసులు.. వాగ్వాదం
- విదేశీ పెట్టుబడిదారులకు ప్రభుత్వాలు తొత్తులన్న ఆందోళనకారులు
జీఈఎస్తో పరిశ్రమలు, పెట్టుబడులు వస్తాయంటూ అబద్ధపు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విదేశీ పెట్టుబడిదారుల చేతుల్లో మన ప్రభుత్వాలు కీలుబొమ్మలుగా మారాయని విమర్శించారు. ఆందోళనకారులను అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించడంతో వాగ్వాదం జరిగింది. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కాగా, ఇవాంకా వ్యతిరేక ఆందోళన గురించి ముందే సమాచారం అందడంతో కొందరు టీపీఎఫ్ నేతలను పోలీసులు ముందుగానే అరెస్ట్ చేసి గాంధీనగర్ పోలీస్ స్టేషన్కు తరలించారు.