కాంగ్రెస్ పార్టీకి నా మనవి ఇదొక్కటే!: నరేంద్ర మోదీ
- నా పేదరికాన్ని హేళన చేయవద్దు
- నేను టీ అమ్మిన మాట నిజమే
- తన గత జీవితం కాంగ్రెస్ కు నచ్చడం లేదన్న మోదీ
ప్రధానిని చాయ్ వాలా అని గత వారంలో కాంగ్రెస్ నేతలు విమర్శించిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. వచ్చే నెలలో రాష్ట్రానికి కొత్త ప్రభుత్వం రానుందని, ఎన్నో ఏళ్లుగా గుజరాత్ ను అభివృద్ధి చేస్తున్న బీజేపీకి మరో అవకాశాన్ని ఇవ్వాలని ఓటర్లను మోదీ అభ్యర్థించారు. కాగా, 2014 ఎన్నికల్లో 'చాయ్ వాలా' ప్రచారం బీజేపీకి కలిసొచ్చిందన్న సంగతి తెలిసిందే. మోదీ తన బాల్యంలో రైల్వే స్టేషన్లలో టీ అమ్మాడన్న వ్యాఖ్యలు, ఆయన పేదరికం నుంచి స్వయంగా ఎదిగిన నేతగా ప్రజల్లో పాప్యులారిటీని పెంచాయి.