Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పండంటి బాబుకు జన్మనిచ్చిన నిన్నటి హీరోయిన్ అంకిత!

  • 'సింహాద్రి' సినిమా ద్వారా పేరు తెచ్చుకున్న అంకిత
  • 2016లో జేపీ మోర్గాన్ వైస్ ప్రెసిడెంట్ విశాల్ తో వివాహం
  • నిన్న తల్లిగా మారిన అంకిత 
ఎన్టీఆర్ హీరోగా ప్రముఖ దర్శకుడు రాజమౌళి రూపొందించిన 'సింహాద్రి' సినిమాలో ఓ కథానాయికగా నటించి పేరు తెచ్చుకున్న 'అంకిత'.. ఆ తర్వాత అవకాశాలు తగ్గడంతో 2016లో అమెరికాలోని న్యూజెర్సీకి చెందిన జేపీ మోర్గాన్ సంస్థ వైస్ ప్రెసిడెంట్ అయిన విశాల్ ను వివాహం చేసుకుంది. అనంతరం సినీ పరిశ్రమకు పూర్తిగా దూరమైంది. ఈ నిన్న (నవంబర్ 26) పండంటి బాబుకు అంకిత జన్మనిచ్చిందని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా, ఆమధ్య ఒక టీవీ ఇంటర్వ్యూ సందర్భంగా వైవాహిక జీవితంలో ఆనందంగా ఉన్నానని అంకిత చెప్పిన సంగతి విదితమే. 
ankita
simhadri
baby boy

More Telugu News