ఓట్లు వేసి గెలిపించిన వారి రుణం తీర్చుకునేందుకే టీడీపీలో చేరా!: వంతల రాజేశ్వరి

  • ప్రజల సేవకే జీవితం అంకితం
  • వైసీపీ నేత ఉదయభాస్కర్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు 
  • ఆయన మాటలను ప్రజలు నమ్మరు
తనకు ఓట్లు వేసి గెలిపించిన ప్రజల రుణం తీర్చుకునేందుకే తాను వైసీపీని వదిలి టీడీపీలో చేరానని తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి తెలిపారు. ప్రజలను తాను మోసగించానంటూ వైసీపీ కోఆర్డినేటర్ అనంత ఉదయభాస్కర్ ఆరోపణలు చేయడంపై ఆమె మండిపడ్డారు. వైసీపీలో ఇమడలేని పరిస్థితిని తనకు కల్పించింది ఉదయభాస్కరేనని అన్నారు. ఇప్పుడు మళ్లీ తనపై తప్పుడు ఆరోపణలు చేస్తూ, ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు యత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల సేవకు అంకితం కావాలని తాను ప్రయత్నిస్తుంటే... సేవ చేయకుండా తనను ఉదయభాస్కర్ అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. ఉదయభాస్కర్ మాటలను ప్రజలు నమ్మరని చెప్పారు. 
Go Back to Shorts
vanthala rajeswari
Telugudesam
rampachodavaram

More Telugu News