nallari kishor kumar reddy: నల్లారి కిషోర్ టీడీపీలో చేరడం సంతోషకరం!: సాయిప్రతాప్

  • నల్లారి కుటుంబంతో సాన్నిహిత్యం ఉంది
  • కిశోర్ టీడీపీలో చేరడం సంతోషకరం
  • అహ్మద్ ఖాన్ కు చంద్రబాబు మంచి స్థానం కల్పిస్తామని అన్నారు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు నల్లారి కిశోర్ కుమార్ రెడ్డి టీడీపీ తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా రాజంపేట టీడీపీ పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ ఛార్జ్ , కేంద్ర మాజీ మంత్రి సాయిప్రతాప్ తన స్పందనను తెలియజేశారు. చిత్తూరు జిల్లాలో తనకు ఎంతో సన్నిహితమైన నల్లారి కుటుంబానికి చెందిన కిశోర్ టీడీపీలో చేరడం సంతోషకరమని చెప్పారు.

కిశోర్ టీడీపీలో చేరే కార్యక్రమానికి తాను రాలేకపోయానని తెలిపారు. పీలేరు నియోజకవర్గంలో తొలి నుంచి టీడీపీకి సేవలందిస్తున్న డాక్టర్ ఇక్బాల్ అహ్మద్ ఖాన్ కు సముచిత స్థానం కల్పిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించడం సంతోషకరమని చెప్పారు. ఆయన సేవలను గుర్తించి సరైన గౌరవాన్ని కల్పిస్తే... మైనార్టీల్లో టీడీపీకి మరింత ఆదరణ పెరుగుతుందని అన్నారు. 
nallari kishor kumar reddy
sai pratap
chandrababu
peleru

More Telugu News