వైర‌ల్ వీడియో: ప్ర‌పంచ సుంద‌రి పోటీల్లో మానుషీ చిల్ల‌ర్ డ్యాన్స్

షార్ట్స్‌లో చూడండి
ఇటీవ‌ల చైనాలోని స‌న్యా సిటీలో జరిగిన మిస్ వ‌ర‌ల్డ్ 2017 పోటీల్లో భార‌త సుంద‌రి మానుషీ చిల్ల‌ర్ కిరీటాన్ని గెల్చుకుంది. ఈ నేప‌థ్యంలో పోటీల్లో గెల‌వ‌డానికి దోహ‌ద‌ప‌డిన ప్ర‌శ్న‌లు - జ‌వాబుల వీడియో ఒక‌టి వైర‌ల్ అయిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు అదే దారిలో ఆమెకు సంబంధించిన మ‌రో వీడియో వైర‌ల్‌గా మారుతోంది.

ఈ వీడియోలో ప్ర‌పంచ సుంద‌రి పోటీల్లో పాల్గొన్న వారంద‌రూ త‌మ‌ను తాము ఒక్కొక్క‌రిగా ప‌రిచ‌యం చేసుకోవ‌డం, త‌ర్వాత వేదిక మీద త‌మ త‌మ దేశ సంప్ర‌దాయాల‌ను గుర్తుచేసేలా నృత్యాలు చేయ‌డం చూడొచ్చు. వీడియో చివ‌ర‌లో 'రామ్‌లీలా' చిత్రంలోని 'డోల్ భాజే' పాట‌కు మానుషీ నృత్యం చేయ‌డం క‌నిపిస్తోంది. ఈ వీడియోను కేవ‌లం మూడు రోజుల్లో 1.2 మిలియన్ల మందికిపైగా వీక్షించారు.

Go Back to Shorts
miss world
manushi chillar
dance
china
sanya city
intro song

More Telugu News