తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ.. 10 జిల్లాల ఆధారంగానే టీఆర్టీ నోటిఫికేషన్ ఇవ్వాలంటూ ఆదేశం!
- 31 జిల్లాల ఆధారంగా టీఆర్టీ నోటిఫికేషన్
- కొత్త జిల్లాలకు రాష్ట్రపతి ఆమోదం లేదంటూ పిటిషన్
- పాత 10 జిల్లాల ఆధారంగానే నోటిఫికేషన్ ఇవ్వాలంటూ హైకోర్టు ఆదేశం
ఈ నేపథ్యంలో తెలంగాణలోని పాత 10 జిల్లాలకే రాష్ట్రపతి ఆమోదం ఉందని... కొత్త జిల్లాలకు ఆమోదం లేదని వీరి తరపు న్యాయవాది కోర్టులో వాదించారు. రాష్ట్రపతి ఆమోదం లేనప్పుడు 31 జిల్లాలను పరిగణనలోకి తీసుకోవడం చెల్లదని కోర్టుకు తెలిపారు. కొత్త జిల్లాల వల్ల పాత జిల్లాలలో స్థానికేతరులుగా అభ్యర్థులు నష్టపోతున్నారని అన్నారు. దీంతో, 10 జిల్లాల ప్రకారమే టీఆర్టీ నోటిఫికేషన్ జారీ చేయాలంటూ హైకోర్టు ఆదేశించింది.