organ donation: అందమైన మనసు.. అవయవదానానికి ముందుకొచ్చిన రకుల్ ప్రీత్!

  • మరణానంతరం అవయవదానానికి అంగీకారం
  • మ్యాక్స్ క్యూర్ ఆర్గాన్ డొనేషన్ పత్రంపై సంతకం
  • 26న 10కే రన్ లో పాల్గొనాలని పిలుపు
వరుస సినిమాలతో మంచి ఫామ్ లో ఉన్న కథానాయిక రకుల్ ప్రీత్ సింగ్ సెలబ్రిటీలకు ఆదర్శంగా నిలిచే నిర్ణయం తీసుకుంది. అవయవదానం విశిష్టతను పది మందికి తెలిసేలా చేసింది. నగరంలో మ్యాక్స్ క్యూర్ హాస్పిటల్స్ నిర్వహించిన ఆర్గాన్ డొనేషన్ ప్లెడ్జ్ (అవయదానానికి ప్రతిజ్ఞ) కార్యక్రమంలో ప్రత్యేక అతిథిగా ఆమె పాల్గొంది.

ఈ సందర్భంగా ‘నేను సైతం’ అంటూ మరణానంతరం అవయవదానం చేయడానికి అంగీకరిస్తూ ఆర్గాన్ డొనేషన్ ప్లెడ్జ్ పత్రంపై సంతకం చేసింది. ఈ నెల 26న అవయవదానంపై అవగాహన కోసం నిర్వహిస్తున్న 10కే రన్ కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చింది. సినీ నటి సమంత సైతం అవయవదానానికి గతంలో అంగీకారం తెలిపిన విషయం తెలిసిందే.

organ donation
pledge
rakul preeth singh

More Telugu News