youtube: స్కైప్, యాపిల్ యాప్ లపై ఎందుకు నిషేధం విధించారో చెప్పిన చైనా!

  • విదేశీ యాప్ లపై చైనాలో నిషేధం 
  • తమకు విదేశీ యాప్ లు అవసరం లేదన్న డ్రాగన్ కంట్రీ 
  • తమ దేశ చట్టాలకు లోబడి నిర్ణయాలు
విదేశీ ఆన్‌ లైన్ కమ్యూనికేషన్ యాప్‌ ల సైట్లపై చైనాలో నిషేధం అమలవుతున్న సంగతి తెలిసిందే. ఈ నిషేధం విధించడంపై చైనా ప్రభుత్వం వివరణ ఇచ్చింది. అందులో విదేశీ ఆన్‌ లైన్ కమ్యూనికేషన్ వ్యవస్థలతో మేలు జరగదని తెలిపింది. వాటి అవసరం తమకు లేదని తేల్చిచెప్పింది. తమ దేశచట్టాలకు లోబడి తమ నిర్ణయాలు ఉంటాయని చైనా స్పష్టం చేసింది.

విదేశీ యాప్ లు దేశ అంతర్గత భద్రతకు ముప్పుగా పరిణమిస్తాయని ఆందోళన వ్యక్తం చేసింది. దేశ భద్రతకు తమ ప్రజలు ఎంతో ప్రాధాన్యం ఇస్తారని చెప్పిన చైనా, ప్రజల అవసరాల మేరకు తామే సొంతంగా యాప్‌ లను రూపొందించుకోగలమని తెలిపింది. అందుకే తాము యూట్యూబ్, స్కైప్, యాపిల్ వంటి యాప్ లపై నిషేధం విధించామని పేర్కొంది. తమ ప్రజలు తమ దేశానికి చెందిన కమ్యూనికేషన్ యాప్‌ లనే వినియోగిస్తారని చైనా చెప్పింది. 
youtube
skype
apple

More Telugu News