అడ్వెంచర్ రియాలిటీ షోకి వ్యాఖ్యానం చేయనున్న మిలింద్ సోమన్
- ఇప్పటికే ఇండియాస్ నెక్స్ట్ టాప్ మోడల్ కార్యక్రమానికి జడ్జిగా ఉన్న సోమన్
- ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌కి చేరుకునే నేపథ్యంగా షో
- ధూమపానానికి వ్యతిరేకంగా ప్రచారం
పార్టిసిపెంట్లు జంటలుగా విడిపోయి, టాస్కులు పూర్తి చేసుకుంటూ, ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌కి చేరడం ఇతివృత్తంగా ఈ కార్యక్రమం నడవనుంది. అయితే పార్టిసిపెంట్ల జంటలో ఒకరు పొగత్రాగే అలవాటున్నవారు, మరొకరు ఇటీవల పొగత్రాగడం నుంచి విముక్తి పొందినవారు అయ్యుండాలి. తమ ప్రయాణంలో భాగంగా పొగత్రాగడం మానేసిన వారు తమ పార్ట్నర్ని పొగత్రాగడం మానేసేలా చేయడమే కాకుండా ఇద్దరూ కలిసి ఎవరెస్ట్ బేస్ క్యాంప్ చేరుకోవాలి. వినూత్న అంశంతో వస్తున్న ఈ కార్యక్రమం వచ్చే నెలలో వియూ వెబ్ ఛానల్లో ప్రారంభం కానుంది.