కోడి ధర తగ్గితే... గుడ్డు ధర మాత్రం కొండెక్కింది!
- కార్తీక మాసం, దీక్షల కారణంగా తగ్గిన చికెన్ ధర
- 25 నుంచి 30 శాతం ఉత్పత్తి తగ్గడంతో పెరిగిన గుడ్డు ధర
- 7 రూపాయలైపోయిన గుడ్డు
ఇక దేశ రాజధాని ఢిల్లీలో ఆయితే.. కేజీ చికెన్ 150 రూపాయలు పలుకుతుండగా, కోడిగుడ్డు ధర 40 శాతం పెరిగి 7 రూపాయల నుంచి 7:50 పైసలకు చేరిందని భారత పౌల్ట్రీ సమాఖ్య అధ్యక్షుడు రమేశ్ కత్రి తెలిపారు. సరఫరా తగ్గి, డిమాండ్ పెరగడమే గుడ్డు ధర పెరగడానికి కారణమని ఆయన తెలిపారు. మరికొన్ని నెలల వరకు ఇదే పరిస్థితి ఉంటుందని, గుడ్డు ధర ఇప్పట్లో కిందికి వచ్చే అవకాశం లేదని ఆయన చెప్పారు. నష్టభయంతో రైతులు గుడ్ల ఉత్పత్తి తగ్గించారని, దీంతో 25 నుంచి 30 శాతం గుడ్ల ఉత్పత్తి తగ్గిందని, దీంతో గుడ్ల ధరలు పెరిగాయని ఆయన వెల్లడించారు.