వంద కోట్ల ఆధార్.. 100 కోట్ల బ్యాంకు ఖాతాలు.. వంద కోట్ల మొబైల్స్.. లింకేజీకి ప్రణాళిక సిద్ధం చేస్తున్న కేంద్రం!
- మూడీస్ రేటింగ్‌తో ఉత్సాహంలో మోదీ ప్రభుత్వం
- సరికొత్త లక్ష్యంతో ముందుకు..
- గడువు లేకున్నా.. వీలైనంత త్వరగా పూర్తిచేసే యోచన
దాదాపు 14 ఏళ్ల తర్వాత భారత బాండ్ రేటింగ్‌ను మూడీస్ 30 పాయింట్లు పెంచడంతో ఊపుమీదున్న మోదీ ప్రభుత్వం వీలైనంత త్వరగా ఆధార్ అనుసంధానాన్ని పూర్తి చేయాలని భావిస్తోంది. ఇందులో భాగంగా వంద కోట్ల బ్యాంకు ఖాతాలను వంద కోట్ల ఆధార్ నంబర్లు, వంద కోట్ల మొబైల్ ఫోన్లతో అనుసంధానం చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం కచ్చితమైన గడువును నిర్దేశించకున్నా వీలైనంత త్వరలోనే లక్ష్యాన్ని చేరుకోవాలని భావిస్తోంది. కాగా, భారత్ రేటింగ్‌ను మూడీస్ చివరిసారి 2004లో అప్‌గ్రేడ్ చేసింది.