అర్ధరాత్రిలోగా మా డిమాండ్లపై స్పష్టత ఇవ్వాలి.. అంతే!: కాంగ్రెస్‌కి హార్ధిక్ పటేల్ అల్టిమేటం
- గుజరాత్లో దగ్గరపడ్డ అసెంబ్లీ ఎన్నికలు
- 30 అసెంబ్లీ స్థానాల్లో మా మద్దతుదారులకు కాంగ్రెస్ పార్టీ టికెట్లు ఇవ్వాలి
- ఈ డిమాండ్‌కు ఒప్పుకుంటేనే కాంగ్రెస్‌కు మద్దతు
ఈ డిమాండ్‌కు ఒప్పుకుంటేనే తాము కాంగ్రెస్‌కు మద్దతు తెలుపుతామని స్పష్టం చేస్తోంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ మాత్రం పటీదార్ వర్గానికి అన్ని సీట్లు ఇవ్వడానికి అంగీకరించడం లేదని తెలుస్తోంది. ఈ విషయమై ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దలతో హార్ధిక్ పటేల్ మద్దతుదారులు చర్చిస్తున్నారు. తమ డిమాండ్లపై కాంగ్రెస్ పార్టీ ఈ రోజు అర్ధరాత్రిలోగా ప్రకటన చేయకపోతే తమ మద్దతు అవసరం లేదని భావించాల్సి ఉంటుందని హెచ్చరించారు.