చైనా ఓపెన్ సూపర్ సిరీస్ నుంచి నిష్క్రమించిన సైనా, ప్రణయ్... మూడో రౌండ్‌కి చేరుకున్న సింధు
- రెండో రౌండ్లో ఓడిపోయిన సైనా, ప్రణయ్
- అతికష్టం మీద గెలిచిన సింధు
- 2014లో చైనా ఓపెన్ సూపర్ సిరీస్ గెలిచిన సైనా
మరోవైపు పురుషుల సింగిల్స్‌లో హెచ్ఎస్ ప్రణయ్ కూడా రెండో రౌండ్లో ఓటమి పాలయ్యాడు. చైనా క్రీడాకారుడు చూక్ యూ లీ చేతిలో 21-19, 21-17 తేడాతో ప్రణయ్ ఓడిపోయాడు. ఇక ప్రపంచ నెం. 2 బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు మాత్రం రెండో రౌండ్లో అద్భుత విజయం సాధించింది. జపాన్ క్రీడాకారిణి సయాకో సాటోను సింధు అతికష్టం మీద ఓడించింది. వీరి మధ్య 24-22, 23-21 పాయింట్ల తేడా మాత్రమే ఉంది. మూడో రౌండ్లో చైనా క్రీడాకారిణి హాన్ యూతో సింధు తలపడనుంది.