హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్‌కి హాజరుకానున్న సీఎం చంద్రబాబు
- నేటితో ముగియనున్న హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్
- నిన్న వాతావరణం అనుకూలించక ఎగరని బెలూన్లు
- అయినప్పటికీ తగ్గని సందర్శకులు
అరకు లోయలో మొదటిసారి నిర్వహిస్తున్న ఈ హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్‌ను పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసే ఉద్దేశంతో ఢిల్లీకి చెందిన ఈ-ఫ్యాక్టర్, స్కైవాల్ట్జ్ సంస్థలతో కలిసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించింది. ఈ ఫెస్టివల్లో పాల్గొనడానికి అమెరికా, స్విట్జర్లాండ్, జపాన్, మలేషియా, తైవాన్ వంటి 13 దేశాలకు చెందిన ఔత్సాహికులు హాజరయ్యారు.