lakshmis veeragrantham: తూచ్... రాయ్ లక్ష్మి కాదు... లక్ష్మీపార్వతి క్యారెక్టర్ చేస్తున్నది పూజా కుమార్!

  • లక్ష్మీపార్వతి పాత్రకు ఎంపికైన రాయ్ లక్ష్మి
  • డేట్స్ అడ్జస్ట్ కాక తప్పుకున్న రాయ్
  • పూజా కుమార్ ను తీసుకున్నట్టు స్పష్టం చేసిన కేతిరెడ్డి
నిర్మాత, దర్శకుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి తలపెట్టిన 'లక్ష్మీస్ వీరగ్రంథం' చిత్రంలో హీరోయిన్ పాత్ర పూజా కుమార్ ను వరించింది. ఈ చిత్రంలో ప్రధాన పాత్రను రాయ్ లక్ష్మి పోషిస్తున్నట్టు తొలుత వార్తలు వచ్చాయి. అయితే డేట్స్ అడ్జస్ట్ కాని కారణంగా రాయ్ లక్ష్మి తప్పుకోగా, పూజాను ఎంపిక చేసుకున్నట్టు సమాచారం.

ఈ విషయాన్ని కేతిరెడ్డి తన ఫేస్ బుక్ ఖాతాలో ధ్రువీకరిస్తూ, ఓ ఆంగ్ల దినపత్రికలో ప్రచురితమైన వార్తను తన టైమ్ లైన్ లో షేర్ చేసుకున్నారు. వీరగంధం సుబ్బారావు సతీమణిగా ఉన్న లక్ష్మీ పార్వతి దివంగత సీఎం ఎన్టీఆర్ జీవితంలోకి ఎలా ప్రవేశించిందన్న విషయమై తాను సినిమా తీయనున్నట్టు ఇప్పటికే కేతిరెడ్డి స్పష్టం చేశారు. ఎన్టీఆర్ పాత్రను మహేష్ మంజ్రేకర్ పోషిస్తుండగా, ఇటీవల ఎన్టీఆర్ స్వగ్రామం నిమ్మకూరులో షూటింగ్ నిమిత్తం యూనిట్ వెళ్లగా, ప్రజల నుంచి నిరసన ఎదురై వెనుదిరిగి వచ్చిన సంగతి తెలిసిందే.
lakshmis veeragrantham
ketireddy
rai lakshmi
pooja kumar

More Telugu News