krishna river: 22 మంది ప్రాణాలు బలిగొన్న బోటు యజమాని పర్యాటక శాఖాధికారి కొల్లి శ్రీధర్!: సీపీ గౌతమ్ సవాంగ్ వెల్లడి

  • కొండలరావు పేరిట సంస్థ రిజిస్టర్
  • పెట్టుబడులు పెట్టిన కొల్లి శ్రీధర్
  • తెరవెనకుండి నడిపిన వైనం 
కృష్ణా నదిలో పడవ మునిగి, 22 మందిని బలిగొన్న ఘటనలో విచారణ చేస్తున్న పోలీసులు మరిన్ని కొత్త విషయాలను బయటపెట్టారు. బోటు యజమానులు పర్యాటక శాఖ అధికారులేనని విజయవాడ పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్ మీడియాకు వెల్లడించారు. రివర్ బోటింగ్ సంస్థను కొండలరావు పేరుతో రిజిస్టర్ చేయించిన పర్యాటక శాఖ అధికారి కొల్లి శ్రీధర్, తెర వెనకుండి అక్రమ బోట్లను నడిపే తతంగాన్ని కొనసాగించాడని తెలిపారు. బోట్లను కొనుగోలు చేసేందుకు పెట్టుబడులు పెట్టింది కొల్లి శ్రీధరేనని సవాంగ్ తెలియజేశారు. ఈ కేసును మరింత లోతుగా విచారించాల్సి వుందని ఆయన అన్నారు.
krishna river
boat
kolli sridhar

More Telugu News