amber heard: ఆ ఒక్క కథనంతో నా కెరీర్ సర్వనాశనం అయింది: హాలీవుడ్ నటి

  • మేగజీన్ ప్రచురించిన కథనంతో కెరీర్ సర్వనాశనమైంది
  • ఆ కథనంతో తాను బైసెక్సువల్ అని అందిరికీ తెలిసిపోయిందని వాపోయిన అంబర్ హియర్డ్
  • లెస్బియన్-గే-బైసెక్సువల్-ట్రాన్స్ జెండర్ (ఎల్జీబీటీ) వర్గాలపై చిన్నచూపుంది
 తన గురించి ఓ మేగజైన్‌లో వచ్చిన కథనంతో తన సినీ కెరీర్ నాశనమైందని హాలీవుడ్ నటి అంబర్ హియర్డ్ (31) తెలిపింది. ఈ నెల 16న విడుదల కానున్న తన 'జస్టిస్ లీగ్' సినిమా ప్రమోషన్ లో ఆమె మాట్లాడుతూ, తనపై బై సెక్సువల్ అని ఆ మేగజీన్ లో కవర్ స్టోరీ రావడంతో విషయం అందరికీ తెలిసిపోయిందని చెప్పింది. దీంతో జీవన విధానాన్ని అలాగే ఇంకా కొనసాగిస్తే మరిన్ని చిక్కులు తప్పవని ఇండస్ట్రీ ప్రముఖులు హెచ్చరించారని ఆమె తెలిపింది. లెస్బిియన్-గే-బైసెక్సువల్-ట్రాన్స్ జెండర్ (ఎల్జీబీటీ) వర్గాలపై చిన్నచూపుందని ఆమె వాపోయింది.

తాను జానీ డెప్, నికోలస్ కేజ్ వంటి స్టార్స్ తో నటించానని, ఆ సమయంలో ఎలా ఉండేదానినో వారినడిగి తెలుసుకోవాలని ఆమె సూచించింది. కొందరు పనిగట్టుకుని తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఎంత అభివృద్ధి చెందుతున్నా, సరికొత్త ఆవిష్కరణలు వస్తున్నా..కొన్ని విషయాల్లో ఎంత వెనుకబడి ఉన్నామో చెప్పేందుకు ఎల్జీబీటీలపై ఉన్న వివక్షే నిదర్శనమని ఆమె తెలిపింది. ప్రతి ఒక్కరి వ్యక్తిగత జీవితాన్ని గౌరవించాలని ఆమె హితవు పలికింది. 
amber heard
movie promotion
hustice league

More Telugu News