ఏపీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్పుకున్న సీనియర్ నరేష్
- శతమానంభవతి, పరంపర చిత్రాలకుగాను నరేష్ కు అవార్డులు
- దివంగత జంధ్యాలకు అంకితం ఇస్తున్నా
- ట్విట్టర్ లో వెల్లడించిన నరేష్
కాగా, 2016లో 'శతమానంభవతి' చిత్రానికి, 2014లో 'పరంపర' చిత్రానికిగాను అవార్డులు లభించిన విషయం తెలిసిందే. వీటితో పాటు దిగ్గజ నటుడు ఎస్వీ రంగారావు పేరిట ఇచ్చే అవార్డుకు కూడా నరేష్ ఎంపికయ్యాడు. ఆ ఆనందంలో ఉన్న నరేష్ ఏపీ ప్రభుత్వానికి ట్విట్టర్ ద్వారా కృతజ్ఞతలు చెప్పాడు.ఈ అవార్డులతో తనకు అరుదైన గౌరవం లభించినట్లయిందని అన్నాడు.