కేటీఆర్‌లా వేషం వేసి.. చేతులు ఎత్తి అభివాదం చేస్తోన్న చిన్నారి.. అబ్బురపరుస్తోన్న ఫొటోలు!
- బాలల దినోత్సవం రోజున చిన్నారుల సంబరం
- పాఠశాలల్లో ఫ్యాన్సీ డ్రెస్ పోటీలు
- తనలా వేషం వేసిన పాప ఫొటోలకు మంత్రి కేటీఆర్ ఫిదా
తమ పాఠశాలలో జరిగిన ఫ్యాన్సీ డ్రెస్ పోటీల్లో పాల్గొన్న ఈ పాప ఫొటోలు కేటీఆర్ వద్దకు చేరాయి. ఐరా అనే రెండేళ్ల చిన్నారి అచ్చం తనలాగే దుస్తులు ధరించి పాఠశాల వేడుకల్లో పాల్గొందని కేటీఆర్ తన ట్విట్టర్ ఖాతాలో తెలిపారు. ఆ పాప తల్లిదండ్రులు తనకు ఈ ఫొటోలను పంపించారని చెప్పారు. ఈ పాప ఫొటోలు తనకు ఎంతగానో నచ్చాయని పేర్కొన్నారు.

