Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కొత్త పోజులు కొడుతున్న హార్దిక్ పాండ్య.. అల‌రిస్తోన్న తాజా ఫొటోలు!

  • ఈ నెల 16 నుంచి ప్రారంభం కానున్న భారత్‌-శ్రీలంక టెస్టు సిరీస్‌
  • ఆల్‌రౌండర్‌ హర్దిక్‌ పాండ్యకు విశ్రాంతి ఇచ్చిన బీసీసీఐ
  • కొత్త స్టైళ్లను ఫాలో అవుతూ ఫొటోలు దిగుతోన్న పాండ్య‌
  • మార్పు కొత్త ఆరంభాలకు తీసుకెళ్తుందట  
భార‌త క్రికెట్ టీమ్‌లో అద్భుతంగా రాణిస్తూ మంచి పేరు తెచ్చుకున్న ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యకు బీసీసీఐ కాస్త విశ్రాంతినిచ్చిన విష‌యం తెలిసిందే. ఈ నెల 16 నుంచి ప్రారంభం కానున్న భారత్‌-శ్రీలంక టెస్టు సిరీస్‌లో ఆయ‌న ఆడ‌డం లేదు.

 దీంతో ఖాళీ స‌మ‌యం దొర‌క‌డంతో ఆయ‌న కొత్త స్టైళ్లను ఫాలో అవుతూ ఫొటోలు దిగి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అభిమానుల‌ను అల‌రిస్తున్నాడు. తాజాగా ఆయ‌న పోస్ట్‌ చేసిన ఫొటోలు వైర‌ల్‌గా మారాయి. ‘మార్పును చూసి భయపడవ‌ద్ద‌ని, అది కొత్త ఆరంభాలకు తీసుకెళ్తుంద‌ని, మిమ్మల్ని మీరు ప్రకాశవంతం చేసుకోండని పాండ్య సందేశం ఇచ్చాడు. మీరూ చూడండి...
     
hatdhik pandya
new photos
Cricket

More Telugu News