cpi ramakrishna: పవన్ కల్యాణ్ మాతో కలిసి వస్తే.. పోరాటానికి ఊపు వస్తుంది: సీపీఐ రామకృష్ణ

  • ఏపీకి ప్రత్యేక హోదా చాలా అవసరం
  • చలో అసెంబ్లీ కార్యక్రమానికి పవన్ కూడా రావాలి
  • స్పెషల్ స్టేటస్ కోసం పవన్ పోరాడాలి
విభజనతో నష్టపోయిన ఏపీ రాష్ట్రం అన్ని విధాలా ముందుకు సాగాలంటే ప్రత్యేక హోదా చాలా అవసరమని సీపీఐ నేత రామకృష్ణ అన్నారు. స్పెషల్ స్టేటస్ కోసం జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా పోరాడాలని ఆయన అన్నారు. తాము చేపడుతున్న 'చలో అసెంబ్లీ' కార్యక్రమానికి పవన్ కూడా కలిసి రావాలని కోరారు. పవన్ కూడా ఇందులో భాగస్వామి అయితే... పోరాటానికి ఊపు వస్తుందని చెప్పారు. ప్రత్యేక హోదా, రాష్ట్ర విభజన సమస్యలపై కర్నూలులో ఈ రోజు రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న రామకృష్ణ పైవిధంగా స్పందించారు. 
cpi ramakrishna
cpi
special status
Pawan Kalyan
janasena
tollywood

More Telugu News