padmavathi: చరిత్రలో అసలు 'పద్మావతి' అనే రాణి లేనేలేదు: చరిత్రకారుడు గంగరాజు

  • అల్లావుద్దీన్ ఖిల్జీ కామాంధుడు
  • మేవార్ పై దండెత్తి రాజుని ఓడించి, రాణిని పెళ్లి చేసుకోవడం వాస్తవం
  • చరిత్రలో పద్మావతి అనే రాణి ప్రస్తావన లేదు
  • పద్మావతి ఒక నవలలో పాత్ర.. నవలా నాయకి, స్వాభిమానం గల యువతి
ఆధునిక భారతదేశ చరిత్రలో 'పద్మావతి' అనే రాణే లేదని చరిత్రకారుడు గంగరాజు స్పష్టం చేశారు. అల్లావుద్దీన్ ఖిల్జీ భారత దేశ చరిత్రలో ఉన్నాడని ఆయన స్పష్టం చేశారు. పద్మావతి అనేది ఓ నవలారచయిత ఊహల రాణి అని ఆయన తెలిపారు. అల్లావుద్దీన్ ఖిల్జీ కామాంధుడన్న కారణంతో ఈ సినిమాలో అభ్యంతరకర సన్నివేశాలు ఉన్నాయేమోనని రాజ్ పుత్ లు ఆందోళన చెందుతుండి ఉండవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.

అంతే కాకుండా ఆ నవలలో పద్మావతిని నేరుగా చూపించడం ఇష్టం లేక ఆమె వెనుదిరిగి ఉన్నప్పుడు అద్దంలో ఆమెను అల్లావుద్దీన్ ఖిల్జీ చూసినట్టు ఉంటుందని ఆయన తెలిపారు. ఇదంతా ఊహాజనితమైన కథేనని ఆయన స్పష్టం చేశారు. వాస్తవ చరిత్రలో ఏం జరిగిందంటే, అల్లావుద్దీన్ ఖిల్జీ.. మేవార్ పై దాడి చేసి రావల్ రతన్ సింగ్ ని ఓడించి, అతని భార్య కమలాదేవిని బందీగా తీసుకెళ్లి తన భార్యగా చేసుకున్నాడని ఆయన చెప్పారు. అల్లావుద్దీన్ ఖిల్జీకి పనిమనుషులు, బానిసలు అన్న తేడా ఉండేది కాదని, పనిమనిషితో కూడా లైంగిక సంబంధాలు ఉండేవని ఆయన చెప్పారు. ఇది చరిత్ర చెప్పిన సత్యమని ఆయన తెలిపారు. 
padmavathi
movie
history

More Telugu News