jagan: చంద్రబాబెందుకు? నేను వస్తా... సయ్యా?: జగన్ కు వర్ల సవాల్

  • తనపై వచ్చిన ఆరోపణలను నిరూపించాలని, లేకుంటే చంద్రబాబు రాజీనామా చేయాలని జగన్ డిమాండ్ 
  • చంద్రబాబు అక్కర్లేదని వర్ల రామయ్య ఎద్దేవా
  • జగన్ అవినీతిని తాను నిరూపిస్తానని వెల్లడి
ప్యారడైజ్ పేపర్లలో తన పేరు వచ్చిన విషయమై, వైకాపా అధినేత జగన్ స్పందిస్తూ, చంద్రబాబు ఆ ఆరోపణలను నిరూపించాలని, లేనిపక్షంలో రాజీనామా చేయాలని డిమాండ్ చేసిన వేళ, టీడీపీ నేత వర్ల రామయ్య స్పందించారు. తన అవినీతి ఆరోపణలను సీఎం చంద్రబాబు నిరూపించాలని డిమాండ్ చేయడం అర్థరహితమని వర్ల కామెంట్ చేశారు.

జగన్ కు దమ్ము, ధైర్యం ఉంటే ఆయన కేసులు విచారిస్తున్న సీబీఐ, అవినీతి మూలాలను మరింతగా బయటపెట్టిన ప్యారడైజ్ పేపర్లను ప్రచురించిన ఇండియన్ ఎక్స్ ప్రెస్ పై చాలెంజ్ చేయాలని అన్నారు. జగన్ అవినీతిని నిరూపించడానికి తమ అధినేత చంద్రబాబు అక్కర్లేదని, వాటిని నిరూపించడానికి తాను చాలని అన్నారు. జగన్ అంగీకరిస్తే, ఎక్కడైనా చర్చకు సిద్ధమని, మరి జగన్ ఒప్పుకుంటారా? అని సవాల్ విసిరారు.
jagan
varla ramaiah
Telugudesam
Chandrababu

More Telugu News