డొనాల్డ్ ట్రంప్ మనవరాలిని పొగడ్తలతో ముంచెత్తిన చైనా అధ్యక్షుడు జిన్ పింగ్!

  • మాండరిన్ నేర్చుకుంటున్న ట్రంప్ మనవరాలు అరబెల్లా
  • ఆ వీడియోలను తెచ్చి జిన్ పింగ్ కు చూపిన ట్రంప్
  • ముచ్చటపడి, ఆమెకు 'ఏ ప్లస్' గ్రేడ్ వస్తుందన్న జిన్ పింగ్
  • చైనా భాషలో పాటలు కూడా పాడుతున్న అరబెల్లా
తన ఆసియా దేశాల పర్యటనలో భాగంగా, జపాన్, దక్షిణ కొరియాల తరువాత చైనాకు వచ్చిన అమెరికా అధ్యక్షుడికి ఘన స్వాగతం లభించింది. చైనా అధ్యక్షుడు క్సీ జిన్ పింగ్ తో డొనాల్డ్ ట్రంప్ నేడు సమావేశం కాగా, ట్రంప్ కుమార్తె ఇవాంకా, జారెడ్ కుష్ నర్ ల ఆరేళ్ల పాపపై జిన్ పింగ్ పొగడ్తల వర్షం కురిపించారు. ఆమె మాండరిన్ భాషను నేర్చుకుంటోందని తెలుసుకున్న జిన్ పింగ్, చైనా భాషలో ఆమెకు 'ఏ ప్లస్' గ్రేడ్ గుర్తింపు లభిస్తుందని కితాబిచ్చారు.

తన మనవరాలు అరబెల్లా చైనా భాషలో పాడుతున్న పాటల వీడియోను ఓ ట్యాబ్ లో జిన్ పింగ్ కు ట్రంప్ స్వయంగా చూపించారు. ఆపై జిన్ పింగ్ స్పందిస్తూ, పాప చక్కగా మాండరిన్ పదాలు పలుకుతోందని కితాబిచ్చారని ప్రభుత్వ రంగ న్యూస్ ఏజన్సీ 'క్సిన్హువా' వెల్లడించింది. కాగా, మూడు రోజుల పర్యటన నిమిత్తం ట్రంప్ చైనా రాజధాని బీజింగ్ కు వచ్చిన సంగతి తెలిసిందే. ట్రంప్ ఎన్నికైన తరువాత, అరబెల్లా ఓ చైనా పద్యాన్ని వల్లెవేస్తున్న వీడియో వైరల్ అయింది కూడా. గతంలో జిన్ పింగ్, ట్రంప్ లు అమెరికాలో కలుసుకున్నప్పుడు కూడా మనవరాలి ప్రతిభను సహ దేశాధినేతకు ట్రంప్ చూపించారు.
Go Back to Shorts
Donald Trump
arabella
si jin ping
China

More Telugu News