చెన్నైలో కలకలం.. జయలలిత టీవీ కార్యాలయంపై ఐటీ దాడులు
- ఈ తెల్లవారుజాము నుంచి కొనసాగుతున్న తనిఖీలు
- శశికళ మేనల్లుడు వివేక్ జయరామ్ నివాసంలోనూ సోదాలు
- జాజ్ సినిమా కార్యాలయాలపైనా దాడులు
జయ టీవీని జయలలిత ప్రారంభించినప్పటికీ, ప్రస్తుతం ఇది ఇటీవల జైలుపాలైన అన్నాడీఎంకే నేత శశికళ కుటుంబ సభ్యుల నియంత్రణలో ఉంది. శశికళ మేనల్లుడు వివేక్ జయరామ్ ఇప్పుడు టీవీ బాధ్యతలను చూస్తున్నారు. ఆగస్టులో అన్నాడీఎంకే ప్రభుత్వం సంక్షోభంలో పడినప్పుడు చానల్ నిర్వహణ కష్టమైంది. కాగా, జయ టీవీ కార్యాలయంపై దాడులు నిర్వహించిన అధికారులు తర్వాత వివేక్ నివాసం, శశికళ కుటుంబ సభ్యులకు చెందిన జాజ్ సినిమా కార్యాలయాలపైనా దాడులు నిర్వహించారు.