రెచ్చగొట్టొద్దు.. మ్యాప్ లో కనపడకుండా పోతారు: ఉత్తర కొరియాకు ట్రంప్ మరో వార్నింగ్
- అణ్వాయుధాలున్నాయన్న అహంకారం వద్దు
- మాతో పెట్టుకోవద్దు
- ఉత్తర కొరియా ఒక నరకం
మీ తాత కలలుకన్న విధంగా ఉత్తర కొరియా స్వర్గంగా మారిపోలేదని కిమ్ జాంగ్ ను ఉద్దేశించి అన్నారు. ఉత్తర కొరియా ఒక నరకమని, అక్కడ ఎవరూ ఉండలేరని చెప్పారు. ఇప్పుడు అమెరికాలో ఉన్నది ఓ భిన్నమైన ప్రభుత్వమనే విషయాన్ని అర్థం చేసుకోవాలని అన్నారు. తమను రెచ్చగొట్టే ప్రయత్నాలను మానుకోవాలని సూచించారు. లేకపోతే, ప్రపంచ పటంలో ఉత్తర కొరియా కనుమరుగవుతుందని హెచ్చరించారు.